మోదీకి పాక్‌ హక్కుల కార్యకర్తల వేడుకోలు..

17 Sep, 2019 08:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : సింధ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాకిస్తాన్‌ హక్కుల కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింధ్‌ సహా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనను ఐరాసలో ప్రధాని మోదీ ప్రస్తావించాలని సింధ్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, పాక్‌లో ప్రముఖ రాజకీయ కార్యకర్త మునవర్‌ సుఫీ లఘరి ప్రధానిని కోరారు. సింధ్‌ ప్రాంతంలో ప్రజల్లో అలుముకున్న భయాందోళనలను తొలగించడం పెనుసవాల్‌గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో పెద్దసంఖ్యల్లో సింధీలు నివసిస్తున్న క్రమంలో వారి సమస్యలను రానున్న ఐరాస సాధారణ సమితి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించాలని కోరారు.మైనారిటీలు, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రకియ అనే పేరిట జరిగిన మానవ హక్కుల కౌన్సిల్‌ 42వ సదస్సును ఉద్దేశించి లఘరి మాట్లాడారు. మత స్వేచ్ఛపై అమెరికా మాట్లాడుతున్న తరహాలో కనీసం మానవ హక్కుల గురించి ప్రధాని మోదీ మాట్లాడాలని కోరారు.ఇక పాక్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పీఓకే, బెలూచిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌లకు చెందిన పలువురు హక్కుల కార్యకర్తలు పాక్‌ తీరును  తప్పుపట్టారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పుతిన్‌ను కలిసిన డాక్టర్‌కు పాజిటివ్‌

విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా 

పేషెంట్‌ జీరో ఎవరు?

అమెరికాలో అసాధారణం 

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది