మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు

16 May, 2020 10:32 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసేందుకు పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) డైరెక్టర్‌ జనరల్‌ షహ్జాద్‌ సలీం శుక్రవారం ఓ ప్రకటన  విడుదల చేశారు. గతంలో మనీలాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. 

అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు ఈ రెండు కేసులను ఎన్‌ఏబీ లాహోర్ ఛైర్మన్ జస్టిస్ (ఆర్) జావేద్ ఇక్బాల్‌ అనుమతి కోసం పంపనున్నుట్లు అధికారులు తెలిపారు. ‘షరీఫ్ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసులు ఎన్‌ఏబీ చైర్మన్ ఆమోదం పొందిన తరువాత వచ్చే వారం లాహోర్లోని అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయబడతాయి’ అని ఒక అధికారి పీటీఐకి చెప్పారు.

‘జియో’ గ్రూప్ గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చ‌కు ట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు