పాకిస్తాన్‌లో ‘భగత్‌ సింగ్‌’ మంటలు

19 Jan, 2018 08:53 IST|Sakshi

సర్దార్‌ స్వతంత్ర యోధుడన్న ఇంతియాజ్‌ ఖురేషి

భగత్‌కు గ్యాలంటరీ అవార్డు ప్రకటిచాలని డిమాండ్‌

భగత్‌ సింగ్‌ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన హఫీజ్‌ సయీద్‌

లాహోర్‌:  స్వతంత్రం కోసం పోరాడిన సర్దార్‌ భగత్‌ సింగ్‌కు పాకిస్తాన్‌లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన ‘నిషాన్‌ ఏ హైదర్‌’తో సత్కరించాలనే డిమాండ్‌ ఊపందుకుంది.  ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్‌లోని షాదమన్‌ చౌక్‌లో భగత్‌సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్‌ సింగ్‌ ఒక యూత్‌ ఐకాన్‌ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. 

స్వతంత్రం కోసం భగత్‌ సింగ్‌ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని ఖురేషి తాజాగా మరోసారి పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నా సైతం భగత్‌ సింగ్‌ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు. సర్దార్ భగత్‌ సింగ్‌.. నిజమైన స్వతంత్ర యోధుడు. అతనికి పాకిస్తాన్‌ అత్యుతన్న గాలంటరీ మెడల్‌తో సత్కరించాలని ఖురేషీ స్పష్టం చేశారు. 

స్వతంత్రం ​కోసం చిన్నతనంలోనే బ్రిటీష్‌తో భగత్‌ చేసిన పోరాటం అసామాన్యం అని కొనియాడారు. నాటి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్‌ సింగ్‌ను, ఆన మిత్రులు అయిన సుఖ్‌దేవ్‌, రాజ్‌ గురులను 1931 మార్చి 23న లాహోర్‌ ఉరితీశారు. 

నిషాన్‌ ఏ హైదర్‌ అంటే:
పాకిస్తాన్‌ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్‌ ఏ హైదర్‌. ఈ పదానికి సింహబలుడు అని అర్థం. 

హఫీజ్‌ సయీద్‌ వ్యతిరేకత:
సర్దార్‌ భగత్‌ సింగ్‌కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్‌పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే ఉద్‌ దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్‌ చౌక్‌ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్‌ పైర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్‌ సయీద్‌ పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా