పాక్ క్రికెటర్ యూనిస్కు షాక్!

25 Feb, 2015 13:17 IST|Sakshi

పాకిస్తాన్ క్రికెటర్లకు కాలం కలిసి రానట్లు ఉంది. వరల్డ్ కప్లో పాక్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి ఇంటా..బయట విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌కు మరొక సమస్య వచ్చి పడింది. ఎవరో ఓ తుంటరి...అతని పేరుమీద ట్విట్టర్‌లో ఫేక్‌ అకౌంట్‌ తెరిచి...వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ యూనిస్‌ ఖాన్‌ పేరున ట్వీట్‌ చేశాడు. దాంతో షాక్‌ తిన్న యూనిస్‌ ..అసలు తనకు ట్విట్టర్‌ అకౌంటే లేదని వివరణ ఇచ్చుకున్నాడు.

మరిన్ని వార్తలు