భారత్‌పై మరోమారు విషం కక్కిన పాక్‌

17 Jan, 2018 12:43 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ.. భారత పర్యటనపై పాకిస్తాన్‌ మరోసారి విషం చిమ్మింది. ఇస్లాంకు భారత్‌-ఇజ్రాయిల్‌ దేశాలు వ్యతిరేకమని.. పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ తప్పుడు ఆరోపణలు చేశారు. నెతన్యాహూ భారత పర్యటనపైనా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. భారత్‌, ఇజ్రాయిల్‌ దేశాలు.. నిరంతరం ముస్లిం భూభాగాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతుంటాయని అన్నారు. భారత్‌ కశ్మీర్‌ను ఆక్రమిస్తే, ఇజ్రయిల్‌ పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుందని ఆసిఫ్‌ ఖ్వాజా విమర్శించారు.

ఇదిలావుంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నెతన్యాహూ.. అహ్మదాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొంటున్న సమయంలో పాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహ్యూ భారత్‌లో ఆరురోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు