తన పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు

5 Feb, 2018 15:59 IST|Sakshi
పెళ్లి కొడుకుగా ఉద్యోగం చేస్తున్న పాక్‌ జర్నలిస్టు

కరాచీ : ఉద్యోగంపై అంకితభావం, నిబద్ధత అంటే ఇదేనేమో.. పెళ్లిరోజు సైతం సెలవుపెట్టకుండా ఉద్యోగం చేశాడు.. ఓ పాకిస్థాన్‌ జర్నలిస్టు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ పెళ్లికొడుకు కాస్త రిపోర్టర్‌ అవతారమెత్తాడు. సిటీ 41 చానెల్‌లో పనిచేసే హనాన్‌ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. 

ఏకంగా తనకు కాబోయే భార్యను, తన తల్లితండ్రులు, అత్తమామలను ఇంటర్వ్యూ చేశాడు. తన తల్లినే ఇంటర్వ్యూ చేస్తూ మీ అబ్బాయి పెళ్లి అవుతోంది.. మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. తనది ప్రేమ పెళ్లని కూడా తెలియజేశాడు. ఈ జర్నలిస్టు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఇంటర్వ్యూపై ట్విటర్‌ వేదికగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పెళ్లిరోజు సైతం విధులు నిర్వర్తించడాన్ని కొందరు సమర్ధిస్తే మరికొందరు ఇది విలువలు కలిగిన జర్నలిజమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే దేవుడా.. జర్నలిజం ఎటుపోతుంది.. రిపోర్టర్‌లు కుటుంబ విషయాలను సైతం కవర్‌ చేయాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు