మాతో పెట్టుకుంటే ఇలానే అవుతది: భారత్‌ నెటిజనులు

31 Aug, 2019 08:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ అనంతరం పాక్‌ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీపై నోరు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే. పాక్‌ ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు నాన తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీని విమర్శించిన ఓ పాక్‌ మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మోదీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు సదరు మంత్రికి కరెంట్‌ షాక్‌ తగిలిందట. వివరాలు.. భారత్‌ను ఎంత ఎక్కువ విమర్శిస్తే.. అంత ఎక్కువగా పాక్ ప్రజలకు దగ్గరకు కావచ్చనే ఫార్ములాను పాటించే పాక్‌ రైల్వే మంత్రి రషీద్.. శుక్రవారం పాక్‌లో కశ్మీర్‌ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఓ ర్యాలీలో మోదీపై విమర్శలే లక్ష్యంగా పెట్టుకుని స్టేజీ మీదకు వెళ్లారు రషీద్‌. జనాలనుద్దేశిస్తూ.. ‘మోదీ వ్యూహం ఏమిటో మాకు తెలుసు’ అన్న కొన్ని సెకన్లలోనే అతని మైక్ షాక్ కొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకున్న కొద్ది క్షణాల్లో మళ్లీ మోదీని విమర్శిచారు. ‘ఈ కరెంట్ షాక్‌తో.. మోదీ ఈ సమావేశంలో పాల్గొన్న జనాల ఆకాంక్షలను దెబ్బతీయలేరు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు రషీద్‌.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రషీద్‌ను భారత నెటిజనులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ‘మోదీ మాట ఎత్తితేనే షాక్ తగిలింది. ఇక ఇండియాతో పెట్టుకుంటే మీ గతి ఏమిటో ఆలోచించుకో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. రషీద్  రెండు రోజుల క్రితం త్వరలో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఉంటుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాక, అవసరమైతే తానే కదన రంగంలోకి దిగి పోరాడతానంటూ ఆవేశపడ్డారు.
(చదవండి: అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!)

>
మరిన్ని వార్తలు