భారత్‌పై విషం చిమ్మిన ముషారఫ్!

16 Oct, 2014 19:39 IST|Sakshi
పర్వేజ్ ముషారఫ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారత్‌పై విషం చిమ్ముతూ నోరుపారేసుకున్నాడు.  ఒక టీవీ ఛానల్‌కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్‌కు వ్యతిరేకంగా  వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను ఎప్పుడు  రెచ్చగొడుతూనే ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో పోరాడేవారిని పాకిస్తాన్ ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు.  భారత ప్రధాని నరేంద్ర మోదీ మతవాది అని విమర్శించారు.

భారత్‌పై యుద్ధానికి పాకిస్తాన్ సైన్యంతోపాటు లక్షలాది మంది యువకులు సిద్ధంగా ఉన్నట్లు ఈ మాజీ సైనిక పాలకుడు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ, యువత కలిస్తే భారత్‌ను ఎదుర్కోవచ్చని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఆహ్వానించగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెళ్లడాన్ని  ఆయన తప్పు పట్టారు.

కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాక్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితి సూచించింది. ఈ నేపధ్యంలో ముషారఫ్ ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
**

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు