పాకిస్తాన్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

18 Mar, 2018 10:18 IST|Sakshi
అమెరికా ఉపాధ్యక్షుడు పేన్స్‌తో పాక్‌ ప్రధాని అబ్బాసీ

వాషింగ్టన్‌ : ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా మరోసారి ఘాటుగా హెచ్చరించింది. ‘ముష్కర ముఠాలపై మీరు చర్యలు తీసుకోకుంటే మేమే నేరుగా దాడులు చేస్తామని’ ఉపాధ్యక్షుడు మైక్‌ పేన్స్‌.. పాక్‌ ప్రధాని అబ్బాసీతో అన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని శుక్రవారం ట్రంప్‌ డిప్యూటీని కలుసుకున్నారు.

ఉగ్రవాద నిరోదానికి పాక్‌ చేపట్టిన చర్యలను అబ్బాసీ వివరించగా, పేన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్లతోపాటు అన్ని ఉగ్రవాద స్థావరాలను తక్షణమే నేలమట్టం చేయాలని  పాక్‌కు సూచించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వవైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహంతో ఉన్నారని, అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించే ఏ సంస్థలనైనా వదిలిపెట్టబోమని పేన్స్‌ గుర్తుచేశారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి ఆ సాయాన్ని పొందేందుకు పాక్‌ చేస్తోన్న యత్నాలన్నీ విఫలమవుతున్నాయి.

మరిన్ని వార్తలు