జాదవ్‌ కేసులో పాక్‌ దుష్ప్రచారం

19 Feb, 2019 18:26 IST|Sakshi
పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ (ఫైల్‌ఫోటో)

హేగ్‌ : కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే)లో మంగళవారం వరుసగా రెండో రోజూ వాదనలు కొనసాగాయి. ఈ కేసులో పాక్‌ తన వాదనను వినిపించే క్రమంలో 2014 పెషావర్‌ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించింది. మరణ శిక్షకు గురై పాక్‌ జైల్లో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలని కోరుతూ ఐసీజేను భారత్‌ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

జాదవ్‌ను భారత గూఢచర్య సంస్థ రా కార్యకర్తగా పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులకు జాదవ్‌ ప్రణాళికలు రూపొందించారని పాక్‌ ఆరోపించింది. కాగా జాదవ్‌ను ఇరాన్‌లో అపహరించిన పాకిస్తాన్‌ ఆయనను బలిపశువును చేస్తోందని భారత్‌ పేర్కొంది. భారత్‌ జెనీవా సదస్సు తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, 2014 పెషావర్‌ ఉగ్రదాడిలో భారత్‌ ప్రమేయం ఉందని పాకిస్తాన్‌ అటార్నీ జనరల్‌ అన్వర్‌ మన్సూర్‌ ఖాన్‌ ఐసీజే ఎదుట తన వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు