పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు

16 Jan, 2020 09:04 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి : కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో తెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశంమని ఐరాస స్పష్టం చేసింది. పాక్‌ కుయుక్తులపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది.

ఓ అఫ్రికన్‌ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరైనా చైనా.. కశ్మీర్‌ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం.

పాకిస్తాన్‌ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్ధీన్‌ అన్నారు. పాక్‌ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్‌ దృష్టి పెట్టాలని సూచించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా