జాదవ్‌కు స్వల్ప ఊరటనిచ్చిన పాక్  

8 Dec, 2017 16:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కులభూషణ్‌ జాదవ్‌ ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు పాక్‌ అంగీకరించింది. క్రిస్టమస్‌ రోజు జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. అలాగే, ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్‌ మెంబర్‌ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు.

తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని, ఉగ్రవాద చర్యలకు దిగాడని ఆరోపిస్తూ పాక్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో జాదవ్‌ను అరెస్టు చేసి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయనకు గుఢాచారానికి ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు భారత్‌ చెప్పినప్పటికీ పాక్‌ అంగీకరించలేదు. అయితే, ఇటీవల జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు తల్లికి అవకాశం ఇవ్వాలని భారత్‌ కోరింది. తొలుత భార్యను మాత్రమే కలిసేందుకు అంగీకరించిన పాక్‌ ఆ తర్వాత సుష్మా స్వరాజ్‌ రంగంలోకి దిగడంతో క్రిస్టమస్‌ రోజు భార్యను, అతడి తల్లిని కూడా కలిసేందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు