ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్‌ ఆర్మీ చీఫ్‌

7 Sep, 2018 15:22 IST|Sakshi
పాక్ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా

ఇస్లామాబాద్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్‌ చెరలో ఉన్న కశ్మీర్‌కు విముక్తి కలిగిస్తామంటూ ప్రగల్భాలు పలికింది. ఓవైపు.. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెబుతుంటే... మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ బజ్వా మాత్రం భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

పాకిస్తాన్‌ రక్షణ రంగం వెబ్‌సైట్‌ కథనం ప్రకారం... ‘ భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడుతున్నారు. వారికి విముక్తి కలిగించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. కశ్మీర్‌లోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాలకు సలాం చేస్తున్నా. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సైనికుల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం’  అంటూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి స్పష్టంగా అర్థమైందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ​

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాని పొదుపు మంత్రం.. లగ్జరీ ప్లైట్‌లో ప్రయాణం

చవకగా పెట్రోల్‌ కావాలా.. అయితే...

నవాజ్‌ జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు

బంగారా డ్యాన్స్‌కు భారత్‌ వేదిక..!

రూ.13,499కే అమెరికాకు, కెనడాకు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రణయ్‌ హత్యపై స్పందించిన చరణ్

బాలీవుడ్‌కు విజయ్‌ దేవరకొండ..!

ట్వీట్‌ ఎఫెక్ట్‌ : చిక్కుల్లో స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌

ఫొటోలు దిగి మురిసిపోయిన సన్నీ లియోన్‌

మరో రికార్డ్‌ ‘ఫిదా’

నిరసన సెగ : లవ్‌యాత్రిగా మారిన సల్మాన్‌ టైటిల్‌