పాక్‌లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు

22 Jan, 2020 09:12 IST|Sakshi

పాకిస్తాన్‌లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్‌ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్‌లోని పంజాబ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో  నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు)

ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్‌ శిబిరాలే చెబుతున్నా‍యని ఇంటెలిజెన్స్‌ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్‌ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి.

>
మరిన్ని వార్తలు