మరి కొన్నాళ్లు జైల్లోనే!

13 Feb, 2015 16:13 IST|Sakshi
మరి కొన్నాళ్లు జైల్లోనే!

లష్కరే తాయిబా ఉగ్రవాది జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ మరికొన్నాళ్లు జైల్లోనే ఉండబోతున్నాడు. కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో తాజాగా పాకిస్తాన్ కోర్టు లఖ్వీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. 2008 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉగ్రవాదిపై ఇప్పటికే పలు కేసులు ఉండగా, వాటిలో ఓ కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.

తనపై తప్పుడుకేసు నమోదు చేశారంటూ, దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదిస్తూ, ఆరున్నర ఏళ్ల క్రితం నమోదైన కేసు ఇంకా నడుస్తోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నబీ తాబిష్ వాదించారు. విచారణ పూర్తికాకుండా ఎఫ్ఐఆర్ను రద్దుచేయడం సాధ్యం కాదన్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నవీద్ ఖాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి  బెయిల్ లభించే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే.

మరిన్ని వార్తలు