పాక్‌కు అమెరికా వరుస షాక్‌లు

10 Nov, 2017 10:50 IST|Sakshi

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారాన్ని నిలిపేస్తేనే అమెరికా, నాటో దళాలు సహాయం చేస్తాయని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధానాలను మానుకుంటేనే పాకిస్తాన్‌కు అంతార్జాతీయ సహకారం ఉంటుందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మాటిస్‌ స్పష్టం చేశారు. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సులో మాటిస్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధానంగా దక్షిణాసియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాంతీయ వాదం, పునరేకీకరణ వంటి అంశాలపై చర్చ జరిగింది.

దక్షిణాసియాలో నాటో దళాలు ముందుకు సాగాలన్నా, ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించాలన్న భారత్‌తో ఉపయుక్తమైన సంబంధాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  పాకిస్తాన్‌లో అయినా, అఫ్ఘనిస్తాన్‌లోనైనా ఉగ్రవాద స్థావరాలు, కేంద్రాలు ఎక్కడున్నా వాటిని నాటో దళాలు ధ్వంసం చేస్తాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా నమ్మడం లేదని ఆయన నాటోకు తెలిపారు.

మరిన్ని వార్తలు