ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న పాక్‌

8 Apr, 2018 18:00 IST|Sakshi
టీ-90 యుద్ధ ట్యాంకు (ఫైల్‌ ఫొటో)

ఇస్లామాబాద్ : తమ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని అందుబాటులోకి తెచ్చేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రష్యా నుంచి యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆయుధాల కోనుగోలు కోసం రష్యా అధికారులతో నేరుగా సంప్రదింపులు మొదలుపెట్టింది. స్వయంగా పాక్‌ మీడియానే ఈ విషయాలను బహిర్గం చేయడంతో భారత్‌, చైనాలు ఈ విషయంపై అప్రమత్తం అవుతున్నాయి. 

రష్యాతో ఆయుధ సంపత్తి సహకారం, ఆయుధాల కొనుగోలు చేస్తున్నామని పాకిస్తాన్‌ రక్షణశాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ కూడా అంగీకరించారు. గగనతల భద్రతతో పాటు కొన్ని రకాల ఆయుధాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు పాక్‌ సన్నద్ధమైనట్లు తెలిపారు. ఆయుధాల విషయంలో రష్యా ఉన్నతస్థితిలో ఉందని, మాస్కో నుంచి టీ-90 యుద్ధ ట్యాంకులు దిగుమతి చేసుకుంటామన్నారు. ఏక కాలంలో కొనుగులు చేయడం లేదని, దీర్ఘకాలికంగా రష్యాతో ఆయుధాల కొనుగోలు కోసం పాక్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. రష్యా మీడియాలో ఇటీవల పలు కథనాలు రావడంతో ఆయుధాల కొనుగోలు వెలుగుచూసింది.

మరిన్ని వార్తలు