'పాక్ ఇప్పుడు గజగజా వణికిపోతోంది'

17 Sep, 2016 12:04 IST|Sakshi
'పాక్ ఇప్పుడు గజగజా వణికిపోతోంది'

న్యూఢిల్లీ: బెలూచిస్తాన్లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడినప్పటి నుంచి పాకిస్థాన్ గజగజ వణికిపోతోందని ఐక్యరాజ్య సమితిలో బెలూచిస్తాన్ పౌరుల హక్కుల ప్రతినిధి మెహ్రాన్ మర్రి అన్నారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటి నుంచి భయపడిన పాక్ ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతంలో పలు మిలటరీ ఆపరేషన్లను పెంచిందని చెప్పారు. పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు పాక్ లోని ఓ ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్ లో అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ సైన్యం చేస్తున్న ధురాగతాలను, బెలూచ్ ప్రజలపై ప్రదర్శిస్తున్న అణిచివేత ధోరణిని మోదీ చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

'భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున, అనంతరం రెండు రోజుల కిందట ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ముందు బెలూచిస్తాన్ పరిస్థితిని లేవనెత్తిని భారత్ కు స్వయంగా నేను.. మా బెలూచ్ ప్రజలం భారత్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. మోదీ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత మాలో కొత్త ఆశలు రేకెత్తాయి' అని ఆయన చెప్పారు. అదే సమయంలో అమెరికాను ఆయన విమర్శించారు. పాకిస్థాన్ చేస్తున్న చర్యలు మొత్తం అమెరికా ముందే తెలుసని, అందుకే ఆ దేశం పట్ల భారత్ లాంటి వైఖరినే కనసాగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన ఆ దేశం తీరు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు