దుమారం.. ఆమె ట్విటర్‌ ఖాతా మాయం

1 Dec, 2017 12:29 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సైన్యంపై ఆ దేశానికి రాజకీయ మహిళా నేత కుమార్తె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సైన్యం వ్యవహారశైలిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో పాకిస్తాన్‌లో పెద్ద దుమారమే రేపింది. నాటకీయ పరిణామాల తర్వాత ఆమె ట్విటర్‌ ఖాతా మాయమయిందని పాక్‌ మీడియా వెల్లడించింది.

తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌(పీటీఐ) నాయకుడు షిరీన్‌ మజారీ కుమార్తె ఇమాన్‌ మజారీ ఈ వీడియో పోస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఫైజాబాద్‌లో సైన్యం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్మీ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని దుయ్యబట్టారని పాకిస్తాన్‌ టుడే పత్రిక తెలిపింది. ఈ వీడియోను ట్విటర్‌ నుంచి తొలగించడానికంటే ముందు పాకిస్తాన్‌లో చాలా మంది వీక్షించారని స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో తన కుమార్తె వ్యాఖ్యలను ఖండిస్తూ ఇమాన్‌ తల్లి షిరీన్‌ మజారీ ట్వీట్‌ చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా ఆమె వాడిన బాషను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇమాన్‌ అంటే తనకు ప్రేమ ఉందని, సైన్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు తన కూతురికి ఉన్నట్టే, ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు తనకూ ఉందన్నారు.

నవంబర్‌ 25న పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో సైన్యం తీరును తప్పుబడుతూ ఇమాన్‌ మజారీ తన ఆవేదనను వీడియో రూపంలో వ్యక్తపరిచారు. ఇమాన్‌ మజారీ ట్విటర్‌ నుంచి తనంత తానుగా వైదొలగారా, లేక బలవంతంగా ఆమె ఖాతాను  తొలగించారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..