పాక్‌లో నిషేధిత సంస్థల ఆస్తుల స్వాధీనం

5 Mar, 2019 09:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని నిషేధిత సంస్థల ఆస్తులను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుందని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. నిషేధిత సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను అమలుచేయడం కోసం కార్యాచరణను రూపొందించేందుకు ఓ చట్టాన్ని పాక్‌ సోమవారం తీసుకొచ్చిందన్నారు.

ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడులు అధికమవుతున్న నేపథ్యంలో పాక్‌ ఈ నిర్ణయం ఈ చట్టం తేవడం గమనార్హం. ఫైజల్‌ మాట్లాడుతూ ఇకపై ఆ ఆస్తులన్నీ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయనీ, త్వరలోనే వాటి అనుబంధ సంస్థల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు