ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ఎలాగైనా ప్రస్తావిస్తాం: పాక్

18 Aug, 2016 20:12 IST|Sakshi
ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ఎలాగైనా ప్రస్తావిస్తాం: పాక్

జమ్ము కశ్మీర్‌లో భారత్ సాగిస్తున్న 'రాజ్య ఉగ్రవాదం' అంశాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 'ఎలాగైనా' తాము ప్రస్తావిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చాలా బలంగా ప్రస్తావిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు.

పాకిస్థాన్ ఎప్పుడూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉందని, గత సంవత్సరం కూడా నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడారని ఆయన అన్నారు. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యదేశాలలో చాలా వరకు గుర్తించాయని చెప్పారు.

మరిన్ని వార్తలు