'సర్జికల్ స్ట్రైక్' పై ఐరాసకు పాక్ ఫిర్యాదు

30 Sep, 2016 11:40 IST|Sakshi
'సర్జికల్ స్ట్రైక్' పై ఐరాసకు పాక్ ఫిర్యాదు

ఇస్లామాబాద్: ఆపరేషన్ 'సర్జికల్ స్ట్రైక్' పేరుతో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి ఆదేశం దిమ్మతిరిగేలా భారత్ చేసింది. దీంతో ఆత్మరక్షణలో పడిన పాక్ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మహీలా లోధి  శుక్రవారం యూఎన్ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ను కలిసి పరిస్థితిని వివరించారు.  భారత్ తమ భూభాగంలోకి చొరబడి చేసిన దాడులను ఆయన బాన్ కీ మూన్ కి వెల్లడించారు. అనంతరం యూఎన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(యూఎన్ఎస్సీ) అధ్యక్షునిగా ఉన్న న్యూజిలాండ్ అంబాసిడర్  గేరార్డ్ వాన్ బోహెమన్ సైతం కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం లోధి మీడియాతో మాట్లాడుతూ.. భారత్ జరిపిన దాడిలో పాక్ సైనికులు సైతం మరణించారని అన్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దన్నారు. నియంత్రణరేఖ వెంబడి తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. భారత్ పేర్కొంటున్నట్టు ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ లాంటి దేమీ జరగలేదని స్పష్టం చేశారు. రెండు గ్రూపుల మధ్య కాల్పలు మాత్రమే జరిగాయని తెలిపారు.  ఈ ఘటనలో ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ చౌహాన్(22) ను బంధీగా పట్టుకున్నామని లోధి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు