పాక్‌ జిత్తులు: కశ్మీర్‌లో హింసకు రహస్య కోడ్‌

13 Sep, 2019 11:17 IST|Sakshi

ఎల్వోసీ వద్ద ఎఫ్‌ఎం స్టేషన్లను ఏర్పాటు చేసిన పాక్‌

దాయాది కుట్రను పసిగట్టిన భారత నిఘా వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్‌ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు కోడ్‌ బాషాల్లో రహస్య సందేశాలను పంపుతున్నట్లు భారత నిఘా వర్గ సంస్థలు గుర్తించాయి. ఇందు కోసం పలు ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్లను ఎల్వోసీ సమీపానికి పాకిస్తాన్‌ తరలించినట్ల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్‌లో దాడులు చేయాలంటూ ఈ కేంద్రాల ద్వారా స్థానిక ఉగ్రవాదులకు సందేశాలను పంపిస్తున్నారని వెల్లడించారు. సంప్రదింపుల కోసం ఉగ్రవాద సంస్థలు జైష్‌ మొముమ్మద్‌ (68/69), లష్కేరే తోయిబా (ఏ3), ఆల్‌ బద్ర్‌ (డీ9) సంకేతాలను వాడుతున్నారని తెలిపారు. సైన్యం, ఉగ్రసంస్థలు, పాకిస్తాన్‌ జాతీయ గీతమైన ‘క్వామీ తరనా’ ద్వారా సందేశాలు పంపతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.

కేంద్ర ప్రభుత్వం కశ్మర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు పాక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే దాయాది దేశం ఎల్వోసీ వద్ద హైప్రీక్వెన్సీతో రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. కాగా ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే.

చదవండి: భారీ కుట్రకు పాక్‌ పన్నాగం.. మసూద్‌ విడుదల!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా