పాక్‌ మహిళకు ఐరాస పురస్కారం

20 Dec, 2018 02:12 IST|Sakshi
అస్మా జహంగీర్‌

ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్‌(66)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం–2018 అస్మాను మరణానంతరం వరించింది. పాకిస్తాన్‌లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు.

న్యూయార్క్‌లో మంగళవారం సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు. అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్‌లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ డిఫెండర్స్‌(ఐర్లాండ్‌)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది.

మరిన్ని వార్తలు