టమాటో కిలో@ 300.. మీ రాజకీయాలే కారణం..

28 Oct, 2017 09:41 IST|Sakshi

ఢిల్లీ :  టమాటో ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ పౌరుడు నిత్యవసరాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. అయినా రాజకీయ నాయకులు మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. వారి నుంచి నిత్యవసరాల దిగుమతులను చేసుకోం అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఇది పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ న్యూస్‌పేపర్‌లో ప్రచురించిన ఓ అభిప్రాయం. 

పాకిస్తాన్‌లోని లాహోర్‌, మరికొన్ని పట్టణాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ. 300 పలుకుతుండటం సగటు పౌరుడికి మింగుడుపడనివ్వడం లేదు. దీనిపై స్పందించిన ఓ పాకిస్తానీ మంత్రి ' మన రైతులు ఉండగా.. విదేశీ రైతులపై ఆధారపడటం దేనికీ' అని వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి దిగుమతులు మళ్లీ ప్రారంభించేలా చేయడానికే ఏవో దుష్టశక్తులు ఈ కుట్ర చేస్తున్నాయని అన్నారు. 

ఓ సారి మంత్రిగారి తలపై ట్రక్కు టమాటాలను కుమ్మరిస్తే విషయం అర్థమవుతుంది అంటూ పత్రికలో రచయిత వ్యాఖ్యానించారు. జాతీయత పేరుతో పౌరుల కడుపు కాల్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. లాహోర్‌లో కిలో రూ.300 పలుకుతున్న టమాటో.. అక్కడి నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న అమృతసర్‌లో రూ.40కే దొరుకుతున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు