పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి..

3 Nov, 2015 18:52 IST|Sakshi
పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి..

ముల్తాన్: పెళ్లికి ఒప్పుకోనందుకు యువతిపై అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. ఆమె దాదాపు నెల రోజుల పాటు మరణంతో పోరాడి పోరాడి.. ఓడిపోయింది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్తానీ యువతి మంగళవారం మృతి చెందింది. తనతో పెళ్లికి నిరాకరించినందుకు సోనియా బీబీ(20)పై మాజీ ప్రియుడు లతీఫ్ అహ్మద్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన ముల్తాన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో సోనియాబీబీ శరీరంలో 45 నుంచి 50 శాతం కాలిపోయింది. ఈ దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లతీఫ్ అహ్మద్(24) ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పాకిస్తాన్ ఛాందసవాదులు, పితృస్వామిక సమాజానికి వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతి కోసం పోరాడే ఔరత్ ఫౌండేషన్ ఈ దాడిని ఖండించింది. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో దాదాపు 3000 మంది మహిళలు వివిధ రకాల దాడుల్లో హత్యకు గురయ్యారని ఔరత్ ఫౌండేషన్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు