టీచర్‌కు రూ. 6.8 కోట్ల ప్రైజ్‌మనీ

14 Mar, 2016 13:27 IST|Sakshi
టీచర్‌కు రూ. 6.8 కోట్ల ప్రైజ్‌మనీ

దుబాయ్: పాలస్తీనాలోని శరణార్ధి శిబిరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు హనన్ అల్ హ్రౌబ్ దాదాపు రూ. 6.8 కోట్ల విలువైన గ్లోబల్ టీచర్ ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన రాబిన్ చౌరాసియాతో పాటు మరో 8 మందిని తుది పోరులో వెనక్కినెట్టి ఈ ఘనతను సాధించారు. దుబాయ్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వీడియో లింక్ ద్వారా పోప్ ప్రాన్సిస్ విజేతను ప్రకటించారు.

అనంతరం ‘నేను సాధించాను, విజయం సాధించాను, పాలస్తీనా విజయం సాధించింది’ అంటూ హనన్ పొంగిపో యారు. కేరళ మూలాలున్న వ్యాపారవేత్త సన్ని వార్కే గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను స్థాపించారు. విద్యావృత్తికి అత్యుత్తమ సేవలందించిన వారికి 2015 నుంచి ఈ బహుమతిని ఇస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు