'అటాక్కు వాట్సాప్ వాడారు'

17 Dec, 2015 18:18 IST|Sakshi
'అటాక్కు వాట్సాప్ వాడారు'

వాషింగ్టన్: పారిస్ దాడులకు సంబంధించి విచారణ అధికారులు తొలిసారి కొన్ని అధికారిక ప్రకటనలు చేశారు. దాడులకు పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సంకేత సంక్షిప్త సందేశ యాప్స్ను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. దాడి అంశాన్ని ఎవరూ గుర్తించకుండా ఈ యాప్స్ ద్వారానే దాచిపెట్టి ఉంచినట్లు చెప్పారు. అయితే, ఆ సంకేత రూపంలో ఉన్న సందేశాల్లో ఉన్న సమాచారం ఏమిటనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆ భాషను ఇంకా వారు గుర్తించలేకపోయారని కూడా తెలుస్తోంది. పారిస్ దాడులు జరిగిన తర్వాత విచారణ అధికారులు చేసిన తొలి అధికారిక ప్రకటన ఇదే.

గతంలో దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో కొన్ని సంకేత సంక్షిప్త సందేశ యాప్స్ ఉన్నాయని చెప్పారు.. కానీ ఆ అంశాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అనంతరం కొద్ది రోజులపాటు వాటిని పరిశీలించిన అధికారులు కుట్రకు సంబంధించి ఉగ్రవాదులు తమనుతాము సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్, టెలిగ్రాంవంటి యాప్స్ ను ఉపయోగించారని, తమ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారని గుర్తించారు. అయితే, ఈ యాప్స్ లలో ఇంకా ఎలాంటి ఆధారాలు మాత్రం అధికారులకు తెలియలేదు. విచారణ పూర్తయితేగానీ, మొత్తం సమాచారం వివరించలేమని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు