సూసైడ్ బాంబర్ ను బతికించాలనుకున్నా...

21 Nov, 2015 15:53 IST|Sakshi

పారిస్ :  ఫ్రెంచ్ కు చెందిన ఓ నర్స్  కాంప్తోయిర్ వోల్టైర్ వోల్టైర్  కేఫేలో కాల్పులు సందర్భంగా తనను తనను తాను పేల్చుకున్న ఉగ్రవాదిని కాపాడబోయాడట.  పారిస్ లో వరస  ఉగ్రదాడుల్లో భాగంగా   కెఫే లో  కూడా కాల్పుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

పారిస్ లో ఒక హాస్పిటల్ లో పనిచేసే  డేవిడ్ (46)   అతని  స్నేహితునితో కలిసి కెఫేకి డిన్నర్ కి వచ్చాడు.  ఇంతలో పెద్ద పేలుడు సంభవించింది.  డేవిడ్  వెంటనే అప్రమత్తమయ్యాడు.  హెటోల్ లో ఉన్న గ్యాస్ ఆఫ్ చేయమంటూ గట్టిగా అరుస్తూ గాయపడిని వారిని ఆదుకునే పనిలో పడ్డాడు. ఇంతలో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉన్న వ్యక్తిని గమనించాడు.   అతని నడుముకు  రకరకాల రంగుల్లో ఉన్న వైర్లను  చూసి షాకయ్యాడు. వెంటనే అతనికి పరిస్థితి అర్థమై ప్రాణాలను దక్కించుకున్నాడు.

'భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ హడావుడిగా పరుగెత్తుతున్నారు. నెత్తురోడుతున్న ఓ మహిళను, ఓ యువకుడిని కాపాడాను.  మరో వ్యక్తి తీవ్రంగా  గాయపడి  స్పృహలేనట్టుగా పడి  ఉన్నాడు. అతను  మామూలు కస్టమర్ అనుకున్నా.  అతడిని సేవ్ చేయాలనుకున్నా... కృత్రిమ శ్వాస (సీపీఆర్) అందించే క్రమంలో అతని చొక్కాను తొలగించా.   పెద్ద గాయమైంది. దాదాపు 30  సెం.మీ  మేర లోతైన గాయంతో పాటు తెలుపు,ఎరువు, నలుపు, ఆరెంజ్ రంగుల్లో వైర్లు అవీ చూస్తే దిమ్మతిరిగింది. ఏదో పేలుడు పదార్థం అని, అతను  సూసైడ్ బాంబర్ అని అర్థమైంది.  వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్న పైర్ సిబ్బందిని అలర్ట్ చేసి.. డైనింగ్ రూం వదిలి టెర్రస్ మీదికి పరుగెత్తా..లేదంటే నా ప్రాణాలు కూడా గాల్లోకి కలిసేవే అంటూ ఆనాటి  సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

అయితే  కెఫే లో ఉగ్రవాదిని ఇద్దరు వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసిన ఘటన వీడియోలో రికార్డయింది. ఒకరు డేవిడ్ కాగా మరొకరు ఎవరో ఇంకా తెలియలేదు.  ఈ ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాది అబ్దె సలాం  హతమయ్యాడు.
 

మరిన్ని వార్తలు