ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు

2 Oct, 2015 19:52 IST|Sakshi
ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు

జకర్తా: ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. శుక్రవారం 10 మందితో వెళ్తున్న విమానం ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జాడలేకుండా పోయింది.

ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది. ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మకస్సార్లో మరో 30 నిమిషాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్టు ఆ దేశ రవాణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు. గత ఆగస్టులో  54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేసియా విమానం కుప్పకూలింది.

మరిన్ని వార్తలు