విమానంలో అమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని!

23 Dec, 2016 11:18 IST|Sakshi
విమానంలో అమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని!

న్యూయార్క్: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పై ఓ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణికుడిని విమానం నుంచి బలవంతంగా దించేశారు. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్.కెన్నడీ ఎయిర్ పోర్టులో గురువారం ఈ తతంగం జరిగింది. ప్యాసెంజర్ ను విమానం నుంచి దింపివేసినట్లు జెట్ బ్లూ ఎయిర్ వేస్ వెల్లడించింది.

మరో ప్రయాణికుడు మార్క్ షెఫ్ ఈ విషయంపై స్పందించాడు. విమానంలో ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి భర్తతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఇవాంకా వద్దకు వెళ్లాడు. 'ఓ  మై గాడ్.. ఇది నిజంగానే నాకు పీడకల. మీరు దేశాన్నే కాదు విమానాలను వదిలిపెట్టడం లేదు అంటూ ట్రంప్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు' అని మార్క్ షెఫ్ వివరించాడు.

జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ సిబ్బంది మాట్లాడుతూ.. ఆ ప్యాసింజర్ ఇవాంకా, ఆమె భర్తతో దురుసుగా ప్రవర్తించాడు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మేం ఎంతగానో వారించాం.. మర్యాదగా వెళ్లి సీట్లో కూర్చోవాలని సర్దిచెప్పగా మాటలు పేల్చుతూనే ఉన్నాడు. దీంతో ఓపిక నశించిన సిబ్బంది, ఇతర ప్రయాణికులకు అసౌక్యం కలకకూడదని భావించి అతడి విమానం నుంచి దింపివేసిట్లు చెప్పారు. అయితే మరో విమానంలో అతడికి అవకాశం ఇచ్చి సహకరించినట్లు తెలిపారు. వాస్తవానికి విమానంలో ఏం జరిగింది, ప్యాసింజర్ పేరు ఏంటన్న వివరాలను ఎయిర్ లైన్స్ సిబ్బంది బహిర్గతం చేయలేదు.

మరిన్ని వార్తలు