‘కరోనా’ నుంచి రక్షణకు హెల్మెట్‌

29 Jan, 2020 18:59 IST|Sakshi
విమానంలో హెల్మెట్‌తో ప్రయాణికుడు

పెర్త్‌: చైనాలో షాంఘై నగరం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నగరానికి బుధవారం నాడు ఉదయం 9.30 గంటలకు వచ్చిన విమానంలో ప్రయాణికులందరిలోనూ కరోనా వైరస్‌ భయం కనిపించింది. వారంతా మూతికి, ముక్కుకు క్లినికల్‌ మాస్క్‌లు ధరించి రాగా, ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా తలకు మోటారు బైక్‌ హెల్మెట్‌ ధరించి వచ్చారు. అయినా వారిని వెంటనే కిందకు దిగనీయలేదు. వైద్య సిబ్బంది వచ్చి వారి చుట్టూ వైరస్‌ నాశన మందును స్ప్రే చేసిన తర్వాతనే ప్రయాణికులను విమానం దిగేందుకు అనుమతించారు. (చదవండి: మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా)


విమానం ప్రయాణంలో తన కొడుకు చికాకేసి పలుసార్లు మాస్క్‌ తీసివేసేందుకు ప్రయత్నించాడని, తాను అందుకు అవశాశం ఉండకుండా పక్కనే ఉండి జాగ్రత్త పడ్డానని జాన్‌ వూ అనే వ్యక్తి తెలిపారు. చైనాలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య నాలుగున్నర వేల నుంచి ఆరు వేలకు హఠాత్తుగా పెరగడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. చైనా నుంచి ఆస్ట్రేలియా వచ్చిన ఆస్ట్రేలియన్లలో 16 మందికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానించి అధికారులు వారిని ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో ఉన్న మరో 600 మంది ఆస్ట్రేలియన్లను ఇంకా తమ దేశానికి తీసుకురావాల్సి ఉందని అధికారులు తెలిపారు. (చదవండి: కరోనా వైరస్‌తో ఎంతటి ముప్పు!?)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు