కరోనా నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారంటే

23 Feb, 2020 12:16 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ప్రసుతం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌ మెల్లిగా కొరియా, యూరప్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా పాకింది. కరోనా ప్రభావంతో ఇప్పటివరకు దాదాపు 2300 పైగా మృతి చెందగా, 75వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కరోనా బారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏదో విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కొందరు జంతు వేషధారణలో, మరికొందరు శరీరం పూర్తిగా కప్పివేసేలా దుస్తులను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియాలో ఒక విమానంలో ప్రయాణించిన ఇద్దరు మాత్రం కరోనా బారీ నుంచి తప్పించుకునేందుకు చేసిన పని ప్రసుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(కోవిడ్‌-19 : కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!)

ఆ వీడియోలో ఇద్దరు తమ శరీరాలను పూర్తిగా ప్లాస్టిక్‌ అవుట్‌ఫిట్‌తో కప్పివేసుకున్నారు. అందులో ఒక మహిళ పింక్‌ కలర్‌లో ఉన్న ప్లాస్టిక్‌ అవుట్‌ ఫిట్‌ను ధరించి నిద్రపోతుండగా, మరొక వ్యక్తి  వైట్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ను ధరించి విమానంలోని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ వారు వేసుకున్న అవుట్‌ ఫిట్లకు చిన్నపాటి రంధ్రం కూడా లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. కరోనా వైరస్‌ రాకుండా వారు తీసుకున్ననిర్ణయం మంచిదే.. కానీ మరి ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉన్న ప్లాస్టిక్‌ అవుట్‌ ఫిట్లను ధరిస్తే అసలుకే మోసం వస్తుందని నెటిజన్లు ​కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 15 కోవిడ్‌-19 కేసులను గుర్తించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. (తగ్గుతున్న కోవిడ్‌ కేసులు)

మరిన్ని వార్తలు