డబ్బు కోసం కూతుళ్లను అలా మార్చేశారు!

20 Jul, 2017 12:52 IST|Sakshi
డబ్బు కోసం కూతుళ్లను అలా మార్చేశారు!

వాషింగ్టన్: డబ్బు కోసం ఆశపడి కన్న కూతుళ్లను సెక్స్ బానిసలుగా విక్రయించిన కేసులో బాధిత బాలికల తల్లిదండ్రులకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం దని బక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ తెలిపారు. పెనిస్లేవియా తల్లిదండ్రులు హేయమైన పనికి పాల్పడ్డారని అటార్నీ అన్నారు. డానియెల్ స్టాల్జ్ ఫస్(44), సావిల్లా స్టాల్జ్ ఫస్(43) దంపతులకు 9 మంది సంతానం. అయితే డబ్బు కోసం ఈ దంపతులు నీచానికి ఒడిగట్టారు. తొమ్మిది మంది కూతుళ్లలో ఆరుగురిని ఓ వ్యక్తికి అమ్మాలని నిర్ణయించుకున్నారు.
 
లీ కప్లాన్(51) అనే వ్యక్తికి తమ ఆరుగురు కూతుళ్లను ఒప్పందం ప్రకారం వారి పేరేంట్స్ అమ్మేశారు. తమ ఇంట్లోనే బాలికలతో అతడు శృంగారం చేసుకోవచ్చునని, అందుకుగానూ తమకు అడిగినప్పుడల్లా కాస్త డబ్బు ఇవ్వాలని ముందుగానే కప్లాన్ ను ఒప్పించారు. 9 ఏళ్ల నుంచి టీనేజీ వయసున్న కూతుళ్లను ఆరుగురిని భయపెట్టి అతడికి సెక్స్ బానిసలుగా చేశారు. గత కొంత కాలంగా కప్లాన్ ఆ అమ్మాయిలపై అత్యాచారం చేస్తూ ఇష్టరీతిన ప్రవర్తించసాగాడు. బాధిత బాలికల పరిస్థితిపై పొరుగింటివాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. గత ఏప్రిల్ లో డానియెల్ స్టాల్జ్ ఫస్, సావిల్లా స్టాల్జ్ ఫస్, మరో నిందితుడు కప్లాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధిత బాలికలలో ఇద్దరితో కప్లాన్ సంతానం కలిగిఉన్నాడని, ఆరుగురితోనూ శారీరక సంబంధాలున్నాయని వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. కప్లాన్ ఈ తరహా 17 కేసులో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది. తల్లి సావిల్లా తాము చేసిన పనికి పశ్చాత్తాప పడుతుండగా, తండ్రి డానియెల్ మాత్రం తప్పు చేసినట్లుగా భావించడం లేదు. ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడటం, గృహ నిర్బంధం చేశారు కనుక చట్టప్రకారం వీరికి గరిష్టంగా శిక్ష ఎంతకాలం వేయవచ్చునని లాయర్లు అభిప్రాయపడ్డారు. అయితే అభంశుభం తెలియని ఆ బాధిత అక్కాచెల్లెళ్లు మాత్రం తాము కప్లాన్ కు భార్యలమని భావిస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు