మత్తులో చెప్పలేని పనులు చేశారు..!

13 Jul, 2016 12:22 IST|Sakshi
మత్తులో చెప్పలేని పనులు చేశారు..!

న్యూయార్క్: తప్పతాగి మత్తులో జోగే వ్యక్తులను అప్పుడప్పుడు మనం రోడ్లపై చూస్తూనే ఉంటాం. అడుగుతీసి అడుగేయలేని స్థితిలో ఉండే అలాంటి వారు చేసే హంగామాను జనం వింతగా చూడటం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటనే న్యూయార్క్లో చోటు చేసుకుంది. కాకాపోతే, అలాంటివారు ఒకరిద్దరు కాదు.. ఒకేసారి ముప్పై మందికి పైగానే. తీసుకున్న మాదకద్రవ్యాలు కాస్త ఎక్కువ పనిచేయటంతో వీరంతా రోడ్లపై సృష్టించిన హడావిడి అంతాఇంతా కాదు. ఆ మత్తులో కొందరైతే నడిరోడ్డుపైనే చెప్పలేని పనులు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. నియంత్రణ కోల్పోయి వీధుల్లో నానా వీరంగం సృష్టిస్తున్న వీరిని అధికారులు తంటాలు పడి ఆసుపత్రికి తరలించారు. ఇలా ప్రవర్తించిన వీరంతా ప్రమాదకరమైన మత్తుపదార్థం సింథటిక్ మారిజోనాను ఒకేచోట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే.. వీరు తీసుకున్న బ్యాచ్లో మోతాదుకాస్త మించి ఉంటుందని భావిస్తున్నారు. రోడ్లపై వాంతులు చేస్తూ.. తూగుతూ.. కిందపడి పొర్లుతూ వారు చేసిన హంగామా చూసిన వీధిలోని జనాలు భయపడిపోయారు. వారు తీసుకున్న మత్తు పదార్థం తక్కువ ధరకే లభిస్తుందని, అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని వైద్యులు వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు