నత్తలు తిని బతికేశారట!

29 Oct, 2016 17:28 IST|Sakshi
నత్తలు తిని బతికేశారట!

బీజింగ్: నైరుతి చైనాలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. గత ఏడాది జులైలో యునాన్ ప్రావిన్స్‌లోని జింగై గ్రామంలో ఓ పాఠశాల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా పరాతన కాలం నాటి అవశేషాలు కనిపించాయి. దీనిపై పరిశోధన జరిపిన పురాతత్వశాస్త్రవేత్తలు అక్కడ దొరికిన మానవ ఎముకల అవశేషాలను పరిక్షించి అవి 3400 ఏళ్ల క్రితం నాటివని తేల్చారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో ఇళ్లు, సమాధులు, శవపేటికలు, రోడ్లు, బూడిద గుంటలు, కుండలు, రాళ్లతో చేసిన ఆభరణాలు, నత్తలకు సంబంధించిన అవశేషాలను గుర్తించారు.

పూర్వం అక్కడ జీవించిన వారు నత్తలను అహారంగా తీసుకోవడం మూలంగా వాటి గవ్వలు, కుండ పాత్రలు ఒకేచోట విరివిగా దొరికాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు. అలాగే వారు వేసవి, చలికాలాల్లో వేరువేరు గృహాల్లో నివసించేవారని తెలిపారు. చలికాలంలో వారు ఏర్పాటుచేసుకునే గృహాలు కొంత భూమిలోపల ఉండేలా నిర్మించుకునేవారని గుర్తించారు. పెంపుడు జంతువుల ఆధారాలు సైతం అక్కడ లభించాయి.

మరిన్ని వార్తలు