లాక్‌డౌన్‌ : వైన్‌తో పండుగ చేసుకున్నారు

14 May, 2020 13:58 IST|Sakshi

కరాకస్ : కరోనా నేపథ్యంలో అక్కడికి ప్రజలకు ఈ మహమ్మారి  సోకకుండా మార్చి నుంచే వెనిజులా తమ దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఎటు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బోర్‌గా ఫీలయ్యేవారు. దీంతో పాటు అక్కడి ప్రభుత్వం ఎవరు బయటికి రాకుండా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. వెనిజులాకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏంజెంట్‌ బెర్తా లోపెజ్‌ అనే యువతి లాస్‌ పాలోస్‌ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఉంటున్న నివాసానికి  అన్ని వైపుల అపార్ట్‌మెంట్‌లే కావడంతో బెర్తాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే తను ఉంటున్న రూఫ్‌ టాప్‌ మీదకు ఎక్కి వైన్‌ తాగాలని భావించింది. ఇదే విషయాన్ని తన తోటివాళ్లకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. మొదట ఆమె చేస్తున్న పనిని ఒప్పుకోకున్నా.. తరువాత ఆలోచించి చూస్తే నిబంధనలు బేఖాతరు చేయడం లేదని వారు భావించారు.  అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు తమ బిల్డింగ్‌ రుఫ్‌టాప్‌ ఎక్కి చేపలు పట్టే యంత్రానికి గ్లాసును కట్టేసి వైన్‌ తాగడం ప్రారంభించారు.
('ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే')

వైన్‌ తాగడానికి ఇంత చేయడం అవసరమా అని బెర్తాను అడిగితే.. ఆమె స్పందిస్తూ.. ' లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో బోర్‌గా పీలవుతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరాన్ని కూడా పాటిస్తున్నాం. ఇక ఫిషింగ్‌ లైన్‌ ఎందుకంటే ఎదుటివారికి చీర్స్‌ చెప్పేందుకు ఉపయోగిస్తున్నాం. ఇక రూఫ్‌టాప్‌ మీద వైన్‌ తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాం. వారు నాకు కనిపించేంత దూరంలో ఉండడంతో ఆనందంగా గడిపేస్తున్నాంటూ' చెప్పుకొచ్చింది. అయితే బెర్తా చేసిన చిన్న పని  లంచ్‌, డిన్నర్‌ల వరకు తీసుకెళ్లింది. అయితే అందరు భౌతిక దూరం పాటిస్తూనే ఈ పని చేస్తుండడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉంది.
(కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్‌)

మరిన్ని వార్తలు