కొలంబియాలో కాల్పుల విరమణ

31 Aug, 2016 13:34 IST|Sakshi

బొగోటా: కొలంబియాలో చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో గత 52 ఏళ్లుగా రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్‌ఏఆర్‌సీ) తిరుగుబాటు దారులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సాయుధ పోరుకు తెరపడింది. ఈ పోరులో ఇంతవరకు 2 లక్షల 50 వేలమందికి పైగా మరణించారు.

పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం ఆగస్టు 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్, ఎఫ్‌ఏఆర్‌సీ అధినేత తిమోలియన్ జిమినెజ్ ప్రకటించారు. ‘మేము తుపాకులకు విశ్రాంతి కల్పిస్తున్నాం. ఎఫ్‌ఏఆర్సీతో యుద్ధం ముగిసిపోయింది’ అంటూ అధ్యక్షుడు మాన్యుయెల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు