మనుషుల్లా నడవటం నాకూ తెలుసు

19 Mar, 2018 18:28 IST|Sakshi
లూయిస్‌ నడుస్తున్న దృశ్యాలు

ఫిలడెల్ఫియా : గొరిల్లాలు మనుషుల్లా రెండు కాళ్ల మీద నడవటం పెద్ద విశేషం ఏం కాదు. అయితే అది అరుదుగా జరగాలే తప్ప.. అదే పనిగా ఉంటే మాత్రం చర్చనీయాంశమే. అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ జూలో ఉన్న లూయిస్‌ అనే మగ గొరిల్లా చాలా ప్రత్యేకం. రోజులో దాదాపు సమయం అది రెండు కాళ్ల మీద అది నడుచుకుంటూ వెళ్తుంది.

అయితే అది అలా చేయటానికి కారణం ఉందని చెబుతున్నారు జూ నిర్వాహకులు. ‘లూయిస్‌కు బురద అంటే చికాకు. దానిని చూసేందుకు వచ్చే వాళ్లే వేసే తిండిని అది మట్టి పాలు కానివ్వదు. శుభ్రత ఎక్కువ. నిర్వాహకులు పెట్టే తిండిని కూడా అది చేతిలో పట్టుకునే దాని బోనులోకి వెళ్లి అది తింటుంది. ఆ సమయంలో అది రెండు కాళ్ల మీద నడుస్తూనే ఉంటుంది’ అని నిర్వాహకులు చెబుతున్నారు. 

18 ఏళ్ల లూయిస్‌ ఆ మధ్య ఓ సందర్భంలో ఠీవీగా తిప్పుకుంటూ పోతుంటే.. దానిని వీడియో తీసిన జూ అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేయటంతో వేలలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు