మీ కదలికలతో చార్జింగ్‌!

23 Jul, 2017 01:07 IST|Sakshi
మీ కదలికలతో చార్జింగ్‌!

వాషింగ్టన్‌: మీ ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోయిం దా.. ఇకపై చార్జర్‌ కోసం వెతకాల్సిన పని లేదు.. కేవలం ఒక్కసారి లేచి అటూ ఇటూ తిరిగితే చాలు మీ ఫోన్‌ చార్జ్‌ అవుతుంది. ఎందుకంటే మనిషి కదలికలతోనే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు చార్జింగ్‌ అయ్యే సరికొత్త సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త ఉండటం విశేషం. బ్యాటరీ సాంకేతికతను ఆధారంగా చేసు కుని కేవలం పరమాణువుల మందంలో ఉండే పలుచటి బ్లాక్‌ ఫాస్ఫరస్‌ పొరలతో తయారు చేసి న ఈ వ్యవస్థ ద్వారా తక్కువ మొత్తంలో విద్యుత్‌ తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘భవిష్యత్తులో మన కదలికలతోనే మనమంతా ఎలక్ట్రానిక్‌ పరికరాల చార్జింగ్‌ కేంద్రాలుగా మారుతామని భావిస్తున్నాను’అని అమెరికాలోని వాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్యారీ పింట్‌ పేర్కొన్నారు. కొత్త సాంకేతికతతో రెండు రకాల ప్రయోజనాలున్నాయన్నారు. విద్యు త్‌ను పుట్టించే పరికరం చాలా సన్నగా ఉంటుం దని, కనీసం బయటకు కన్పించకుండా దుస్తు ల్లోని పొరల్లో కూడా అమర్చొచ్చని చెప్పారు. చాలా చాలా తక్కువ కదలికల నుంచి కూడా విద్యుత్‌ను పుట్టించొచ్చని వివరించారు. భవిష్య త్తులో దుస్తులకు కూడా విద్యుత్‌ అందించొచ్చని, అంటే దుస్తుల రంగులు, డిజైన్లను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మార్చుకునే వీలు కలుగుతుందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతికి చెందిన నితిన్‌ మురళీధరన్‌ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా