38 వేల అడుగుల ఎత్తు నుంచి ఫొటోలు

22 Jan, 2018 16:27 IST|Sakshi
కార్గోప్లేన్‌లో దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు వెళ్తున్న సమయంలో భారీ మెరుపులతో కూడిన వర్షం కురిసింది. క్రిస్టియన్‌ తీసిన ఫొటోల్లో అత్యద్భుతమైనది ఇదే.

సాక్షి, వెబ్‌ డెస్క్‌ :  ఒక్క చిత్రంతో వంద మాటలను పలికించొచ్చని అంటారు. 38 వేల అడుగుల ఎత్తు నుంచి భూమి, ఆకాశ అందాల చిత్రాలను కెమెరాలో బంధించి అబ్బా అనిపించారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్‌‌. బోయింగ్‌ 747-8 విమానంలో పైలట్‌తో పాటు కాక్‌పిట్‌లో కూర్చొని ప్రయాణించిన క్రిస్టియన్‌ కళ్లు మిరుమిట్లు గొలిపే చిత్రాలను తీశారు. ఆ తీసిన ఫొటోలు బాగా పాపులర్‌ అయ్యాయి. మరి వాటిపై ఓ లుక్కేయండి.

అలస్కాలో సూర్యాస్తమయ సమయంలో తీసిన చిత్రమిది

మంగోలియాలో సూర్యస్తమయ సమయంలో తీసిన పర్వతాల ఫొటో ఇది.

చంద్రుని కాంతిలో మిరుమిట్లు గొలుపుతున్న మంగోలియా

ఉత్తర ధ్రువం నుంచి వస్తున్న అద్భుత వెలుగును క్రిస్టియన్‌ తన కెమెరాలో ఇలా బంధించారు.

మరిన్ని వార్తలు