ఆకట్టుకునే.. సెలబ్రిటీల స్నానాల గదులు

30 Oct, 2015 00:00 IST|Sakshi
ఆకట్టుకునే.. సెలబ్రిటీల స్నానాల గదులు

గృహ నిర్మాంణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్ కూ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఇటీవల సంపన్నుల ఇళ్ళలోనే కాక సాధారణ ప్రజలు కూడ గృహ నిర్మాణంలో ఆకట్టుకునే ఇంటీరియర్ డెకరేషన్ కు లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఇళ్ళలో ఇంటీరియర్ గురించి వర్ణించడం కూడ కష్టమే. బెడ్ రూం నుంచి... బాత్రూం వరకూ  ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ఇటీవల విడుదలైన కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల బాత్ రూమ్ ల ఇంటీరియర్ డెకరేషన్ ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

న్యూయార్క్ లోని హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్... ప్రపంచ ప్రఖ్యాత సెక్సీతార  మార్లిన్ మన్రో... అపార్ట్ మెంట్లోని బాత్రూం... ఇంద్ర భవననాన్ని తలపిస్తోంది. పాలరాతి మెట్లమీద నల్లని జాకూజ్జీతో పాటు... అద్దాలు అమర్చిన గోడలు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి.  తీర్చి దిద్దిన అలంకరణ... కనువిందు చేస్తోంది. అలాగే  మాజీ బాక్సింగ్ దిగ్గజం  మైక్ టైసన్ సౌథింగ్టన్ ఓహియో హోమ్ లోని పైకప్పులు, గోడలు, గదుల్లోని ప్రతి అలంకరణకు తోడు.. బాత్రూం ఇంటీరియర్లు.... అతడి విలాసవంతమైన జీవితాన్ని బహిర్గత పరుస్తున్నాయి. 1980, 90 లమధ్య మైక్.. నివసించిన ఓహియో హోమ్ లోని రెస్ట్ రూం, బంగారపు వన్నెచిన్నెలద్దిన బ్రహ్మండమైన బ్లాక్ హాట్ టబ్, అద్దాల గోడలు, ఆకట్టుకునే డైజనర్ కిటికీలు అత్యున్నత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1999 లో 49 ఏళ్ళ వయసున్న  మైక్.. తన ఇంటిని అమ్మేసి లాస్ వెగాస్ లో నివసిస్తున్నాడు. ఆ తర్వాత అతడి ఇల్లు చర్చిగా రూపాంతరం చెందింది.

కెనడాలోని ఓ ప్రైవేట్ ద్వీపంలో ఉన్న కెనడియన్ గాయని సెలిన్ డయాన్ అందమైన ఆరు బెడ్ రూమ్ ల ఇంట్లో ఉండే బాత్ రూం లోని టబ్.. బంగారు వన్నెలతో అలంకరించి ఉంది. అలాగే 47 ఏళ్ళ ఓ గాయకుడి ఇంట్లోని బాత్ టబ్ కూడ ఎర్రని రంగులో రిచ్ క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఐకానిక్ సినిమా స్టార్ కాథరిన్ హెప్ బర్న్ ఒకప్పటి లాస్ ఏంజిల్స్ మాన్షన్ లోని బాత్ రూం  చూపరుల కళ్ళు మిరుమిట్లు గొలుపేట్టు చేస్తోంది. బాత్ రూమ్ లోని మార్బుల్ ఫ్లోర్,  హాట్ టబ్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్లోరిడాలోని పాప్ స్టార్ జాసన్ డెరూలో స్నానాల గది.. డినీస్ రిచర్డ్స్ లేడీస్ రూం, లివింగ్ రూం లా కనిపించే కెవిన్ కాస్టనర్ ఇంట్లోని బాత్ రూమ్ లు కూడ విభిన్న అలంకరణలు, ఆకట్టుకునే అందమైన గోడలు, క్లాసిక్ లుక్ నిచ్చే బాత్ టబ్ లతో కళ్ళు తిప్పుకోలేని సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఇక న్యూయార్క్ లోని ప్రముఖ కళాకారుడు ఎడ్వర్డ్ హోపర్స్ వాష్ రూమ్... విక్టోరియా మాన్షన్ ను తలపిస్తుండగా.. బకింగ్ హామ్ షైర్ లో.. బ్రిటిష్ సినిమాల షూటింగ్ లకు తరచుగా వాడే.. జేమ్స్ బాండ్ స్టార్ రోగర్ మూరె ఇంట్లో కాంతులీనే తెల్లని బాత్ రూమ్ లు ఇంటీరియర్ డిజైన్లకే మోడల్స్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మాంఛెస్టర్ సిటీలోని ఇరవై ఏళ్ళ అతి చిన్న వయసైన సాకర్ స్టార్ రహీమ్ స్టెర్లింగ్ రెస్ట్ రూం ఏకంగా ఎందరికో కలల సౌధంగా కనిపిస్తుండటం ఇంటీరియర్ డిజైనింగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. వారి వారి ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటీరియర్ డిజైన్లు  ప్రముఖులు, సెలబ్రిటీల అనుభూతులను, వారి విలాసవంతమైన జీవితాలను కళ్ళముందుంచుతున్నాయి.

మరిన్ని వార్తలు