వారికి సమస్యలు ఎక్కువే, సెలవులు ఎక్కువే

15 May, 2020 16:20 IST|Sakshi

డెన్మార్క్‌: శారీరకంగా ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు ఎక్కువ ఒత్తిడి లేని ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ పనిజీతాలతో, ఎక్కువ సిక్‌లీవ్‌లతో, ఎక్కువ నిరుద్యోగంతో ఉంటాయి అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ విషయాలను ది బీఎమ్‌జే జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనల కోసం  డెన్మార్క్‌లో 2013 నవంబర్ నాటికి ఉద్యోగం పొందిన 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న 1.6 మిలియన్ల మంది ప్రజల ఆయుర్దాయం గురించి అధ్యయనం చేశారు.  (లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!)

ప్రతి వ్యక్తి ఉద్యోగానికి అవసరమైన భౌతిక డిమాండ్ స్థాయిని జాబ్ ఎక్స్‌పోజర్ మ్యాట్రిక్స్ ఉపయోగించి కొలిచారు. ఇలా 317 రకాల వృత్తులపై ఈ పరిశోధన చేశారు. తక్కువ భౌతిక డిమాండ్ల నుంచి ఎక్కుడ భౌతిక డిమాండ్‌ వారిగా ఈ జేఈయమ్‌ స్కోర్‌ను వర్గీకరించారు. తక్కువ శారీరక శ్రమచేసే వారు(16 కంటే తక్కువ),  మితమైన శ్రమ (16-28) ,అధిక శ్రమ చేసేవారికి (28 ప్లస్) స్కోరు కేటాయించారు. దీనికి సంబంధించి డెన్మార్క్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన అధ్యయన రచయితలు కింది విధంగా తెలిపారు. అధిక స్కోరింగ్ ఉద్యోగాలలో నిర్మాణ రంగంలో పనిచేసేవారిని చేర్చారు, అదేవిధంగా ఎక్కువ శారీరక శ్రమ చేసే వడ్రంగి, రాతి విగ్రహాలు చెక్కే వారిని, బిల్డింగ్‌లకు రంగులు వేసేవారిని, ప్లంబింగ్ వంటి పనులుచేసే వారిని చేశారు. తయారీ పరిశ్రమలో పనిచేసేవారిని, ఇళ్లు శుభ్రపరిచేవారిని కూడా ఇందులోనే చేర్చారు. వీరికి ఇచ్చే అనారోగ్య సెలవులు, వైకల్య పెన్షన్‌, నిరుద్యోగ సమస్యలు అన్ని 2017 వరకు నమోదు చేశారు. (అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...)

ఇక వీరు  30, 40, మరియు 50 సంవత్సరాల వయస్సు గల కార్మికులపై ఎక్కువ విశ్లేషణ చేశారు. దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు జేఈఎమ్‌ స్కోరు ప్రకారం శారీరకంగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. ఈ గ్రూపులో  పురుషులు శారీరకంగా డిమాండ్ చేయని ఉద్యోగాలలో పనిచేసే వారి తోటివారి కంటే సగటున దాదాపు మూడు సంవత్సరాలు చిన్నవారుగా ఉంటున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే ఈ తేడా 10 నెలలుగా ఉంది. మహిళలు, పురుషులు ఇద్దరిలోకూడా శారీరక శ్రమ చేసే వారికి శారీరక శ్రమ చేయని వారికంటే తక్కువ జీతం, తక్కువ ఆయుర్ధాయం, ఎక్కువ నిరోద్యోగం, ఎక్కువ ఆరోగ్యసమస్యలు, ఎక్కువ అనారోగ్య సెలవులు తీసుకోవలసి వస్తోంది. 

మరిన్ని వార్తలు