46 పాక్‌ విమానాలు ఖాళీగా తిరిగాయి

21 Sep, 2019 16:16 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు ఒక ఆడిట్‌ నివేదిక వెల్లడించింది. 2016 - 17లో ఇస్లామాబాద్‌ విమానాశ్రయం నుంచి పీఐఏకి చెందిన 46 విమాన సర్వీసులు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు పేర్కొంది. దీనివల్ల ఆ దేశానికి సుమారు రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ విషయం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అంతేగాక హజ్‌, ఉమ్రా ప్రాంతాల్లో కూడా 36 విమానాలు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు నివేదికలో తేలింది. కాగా, కొన్ని నెలల క్రితం నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు పీఐఏ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది.
 

మరిన్ని వార్తలు