ఇందులో పాప్‌కార్న్‌ ఎక్కడుందో చెప్మా!

27 Nov, 2019 14:41 IST|Sakshi

మెదడుకు మేత పెట్టే పజిల్స్‌ సోషల్ మీడియాలో ఎన్నో వస్తూనే ఉంటాయి. తాజాగా పాప్‌కార్న్‌ ఎక్కడుందో కనిపెట్టండి అంటూ ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. బుర్రకు పదును పెడుతున్న ఈ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వెంటనే నెటిజన్లు.. అంగుళం వదలకుండా ఫొటోను జల్లెడ పట్టినా పాప్‌కార్న్‌ ఆచూకీ కానరాలేదు. పాప జడలోని బ్యాండ్‌లో ఉందా? ఆమె వేసుకున్న స్కార్ఫ్‌లో ఉందా? అని భూతద్దం వేసుకుని మరీ చూశారు. కానీ ఎంతకీ పాప్‌కార్న్‌ ఆచూకీ కనుక్కోలేకపోయారు. అయితే కొంతమంది మాత్రం అసలు గుట్టు పట్టేశారు.

ఫొటో అంతా బాగానే ఉంది కానీ పాప కాళ్లు మాత్రం తేడాగా ఉండటంతో పాప్‌కార్న్‌ దొరికిపోయింది. ఆమె చేతిలో పాప్‌కార్న్‌ పట్టుకుని నిలుచుందని పసిగట్టేశారు. అయితే ఆమె చేతిలో పట్టుకున్న పాప్‌కార్న్‌, నిలుచున్న ప్రదేశం ఒకేవిధంగా ఉండటంతో దాదాపుగా అందరూ తికమకపడ్డారు. ఇక ఈ చిత్రం తనను ఎంతగానో గందరగోళానికి గురిచేసింది అంటూ క్రిస్టోఫర్‌ ఫెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అతనికేనా, దీన్ని చూసిన అందరూ మొదట పాప్‌కార్న్‌ వెతకడానికి తలలు గోక్కున్నారు. తర్వాత దాన్ని గుర్తుపట్టి ఓహ్‌.. ఇదేనా అంటూ నవ్వుకున్నారు.

మరిన్ని వార్తలు