విమానంలో హైజాక్‌ అలారం ఆన్‌ చేయడంతో..

7 Nov, 2019 15:09 IST|Sakshi

ఆమ్‌స్టర్‌డామ్‌ : ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో ఆగిన విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారంను పొరపాటున సెట్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో డచ్‌ పోలీసులు భారీ భద్రతా చర్యలతో ఆపరేషన్‌ను నిర్వహించి అది ఫేక్‌ అలారం అని నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం డచ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి మాడ్రిడ్‌కు బయలుదేరిన విమానంలో పైలట్‌ పొరపాటుగా హైజాక్‌కు సంబంధించిన అలారం యాక్టివేట్‌ చేసినట్లు తెలిసింది.

'విమానం హైజాక్‌ అయినట్లు మాకు సమాచారం అందడంతో  వెంటనే ఎమెర్జెన్సీ టీమ్‌ను పిలిపించి విమానాన్ని అదుపులోకి తీసుకున్నాం. అయితే అది ఫేక్‌ అలారం అని, పైలట్‌ తెలియక హైజాక్‌కు సంబంధించిన అలారంను యాక్టివేట్‌ చేశారు. ఈ సమయంలో విమానంలో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా వారంతా క్షేమంగానే ఉన్నారని, విమానం ​బయలుదేరే సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నామని'  ఎయిర్‌పోర్ట్‌ అధికారి వెల్లడించారు.

దీంతో బుధవారం రావాల్సిన పలు విమానాలకు అంతరాయం ఏర్పడినటుల​ అధికారులు తెలిపారు. అంతేగాక విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఎలా యాక్టివేట్‌ అయిందన్న విషయాన్ని మా ఇన్విస్టేగేషన్‌లో తేలుస్తామని పోలీసులు వెల్లడించారు. తాజా నివేదికల ప్రకారం యూరోప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే షిపోల్‌ విమానాశ్రయంలో సంవత్సరానికి 7 కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. 'విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఒక్క బటన్‌తో ఆన్‌ చేయలేము. దానికి నాలుగు అంకెలతో కూడిన ఓ పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానిని ఎవరైనా ట్రాన్స్‌మిట్‌ చేసి ఉంటారని' ఏరోనాటిక్స్ నిపుణుడు జోరిస్ మెల్కెర్ట్ తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా