సినిమానే హ్యాక్‌ చేశారు

16 May, 2017 12:10 IST|Sakshi
సినిమానే హ్యాక్‌ చేశారు

లాస్‌ఏంజెల్స్‌: రాన్సమ్‌వేర్‌ హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. గత రెండు రోజులుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రామ్సన్‌వేర్‌ హ్యాకర్లు ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌ సినిమా వీడియోని తస్కరించారు. వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మించింది. సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కాకుండా ఉండటానికి హ్యాకర్లు భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని బెదిరిస్తున్నారు.

అయితే స్టూడియో సీఈవో బాబ్‌ ఐగర్‌ అంత మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు. హ్యాకర్లు మొదట 5నిమిశాల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారని, అడిగినంత మొత్తంలో చెల్లించకపోతే 20 నిమశాల వీడియోని రిలీజ్‌ చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌ సిరీస్‌లో ఐదో భాగం "డెడ్‌మెన్‌ టెల్‌ నో టేల్స్‌" పేరుతో నిర్మించారు. జాన్‌డెప్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈచిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు