క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!

19 May, 2018 04:26 IST|Sakshi
విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం

ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది

హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం  చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్‌ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్‌ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌–కేనెల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు