పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

22 May, 2020 15:53 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లాహోర్‌ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)‌కు చెందిన విమానం కుప్పకూలింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ‍ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాద ప్రాణనష్టంపై స్పష్టత రాలేదు. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్‌ మీడియా సంస్థ వెల్లడించింది.

ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని తెలిపింది. ఇక  ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆదేశ ఆర్మీ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగ్రాతులను సమీపంలో జిన్నా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓవైపు దేశంలో కరోనా వైరస్‌తో జనజీవనం అస్థవ్యస్థమవుతుండగా తాజాగా విమాన ప్రమాదం ఆ దేశ వాసులను తీవ్రంగా కలచివేస్తోంది.

మరిన్ని వార్తలు