రన్‌ వే పై పేలిపోయిన విమానం .. వీడియో వైరల్

9 Mar, 2018 16:23 IST|Sakshi
లారెడో అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలి పోయిన విమానం

టెక్సాస్: ఓ మినీ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. టెక్సాస్‌లోని లారెడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పైపర్‌ పీఏ-31 పీ మినీ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో మంటలు వ్యాపించడంతో పైలెట్‌ తిరిగి ఎయిర్ పోర్టులో విమానాన్ని దించాలనుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మిని విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానం ఇంజిన్ పేలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అధికారికంగా వీడియో ఫుటేజీని విడుదల చేయకపోయినా, ఈ ఘటనకు సంబంధించి వీడియో స్థానిక మీడియాలో రావడంతో విమానం ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు